“ప్రాజెక్ట్ కే” లో ఆమె షూట్ పై క్లారిటీ.!

Published on May 31, 2023 4:01 pm IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న పలు సెన్సేషనల్ ప్రాజెక్ట్ లలో అయితే యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు చేపట్టిన వరల్డ్ లెవెల్ మాసివ్ బడ్జెట్ చిత్రం “ప్రాజెక్ట్ కే” కోసం తెలిసిందే. మరి ఈ భారీ సినిమాపై లేటెస్ట్ గా లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్నట్టుగా కొన్ని సెన్సేషనల్ వార్తలు వైరల్ అవుతుండగా దీనిపై క్లారిటీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఇక మరో పక్క అయితే ఇదే సినిమాపై లేటెస్ట్ గా ఇంకో బజ్ అయితే బయటకి వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ తర్వాత మరో స్టార్ బ్యూటీ దిశా పటాని కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమెపై ఓ సాలిడ్ యాక్షన్ షూటింగ్ చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై క్లారిటీ తెలుస్తుంది.

దిశా షూట్ చేసిన ఆ చిత్రం ప్రాజెక్ట్ కే నుంచి కాదు ప్రభాస్ టీం క్లారిటీ ఇచ్చారు. దీనితో ఈ అప్డేట్ ప్రాజెక్ట్ కే నుంచి కాదని క్లారిఫై అయ్యింది. ఇక ఈ భారీ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ వారు ఇండియన్ సినిమా దగ్గరే కాస్ట్లీ చిత్రంగా ప్రాజెక్ట్ కి ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :