“హిందుస్తానీ 2” హిందీ ఓటిటి పార్ట్నర్ పై క్లారిటీ


యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా యంగ్ హీరో సిద్ధార్థ్ ముఖ్య పాత్రలో దర్శకుడు శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే “ఇండియన్ 2”. తెలుగులో “భారతీయుడు 2” గా హిందీలో “హిందుస్తానీ 2” గా భారీ బడ్జెట్ తో అవైటెడ్ సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ ని పూర్తి స్థాయిలో ఎంగేజ్ చేయలేకపోయింది. దీనితో నామమాత్రంగానే వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి ఎంట్రీ కూడా ఇచ్చేసింది.

మరి ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి తీసుకురాగా ఇది అందులో కేవలం సౌత్ భాషల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మరి హిందీ రిలీజ్ మాత్రం ఇంకా రాలేదు. అయితే ఈ సినిమా హిందీ హక్కులు మరో సెపరేట్ ప్లాట్ ఫామ్ ఏమీ కొనుగోలు చేయలేదు. ఇదే నెట్ ఫ్లిక్స్ వారు హిందీ హక్కులు కూడా సొంతం చేసుకోగా ఇందులో ఈ చిత్రం అతి త్వరలోనే హిందీ డబ్బింగ్ వెర్షన్ ని కూడా తీసుకొస్తున్నట్టుగా తెలిపారు. సో హిందీ కూడా ఇందులోనే అందుబాటులోనే ఉండనుంది అని చెప్పాలి.

Exit mobile version