“వార్ 2” లో ఎన్టీఆర్ రోల్ పై క్లారిటీ.?

లేటెస్ట్ గా ఇండియన్ సినిమా ని షేక్ చేసిన సెన్సేషనల్ అనౌన్సమెంట్ “వార్ 2” చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉన్నాడనే వార్తే అని చెప్పాలి. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ తో కలిసి భారీ యాక్షన్ థ్రిల్లర్ “వార్” కి సీక్వెల్ అయ్యిన ఈ సినిమాలో ఎన్టీఆర్ పార్ట్ అవ్వడంతో ఒక్కసారిగా వేరే లెవెల్ హైప్ నెలకొంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ ఏంటి ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది.

మరి చాలా మంది అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ని నెగిటివ్ షేడ్స్ లో చూస్తారని అనుకుంటున్నారు. కానీ ఇందులో అయితే హృతిక్ ఎన్టీఆర్ మధ్య యుద్ధంలా కాకుండా ఇద్దరూ మంచి మిత్రుల్లాంటి రోల్స్ లో కనిపించనున్నట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే ఎన్టీఆర్ విలన్ రోల్ లో కనిపిస్తారు అనే మాటల్లో ప్రస్తుతానికి నిజం లేదనే అనుకోవాలి. అంటే ఈ మధ్య వచ్చిన “పఠాన్” చిత్రంలో షారుక్ తో సల్మాన్ ఎలా అయితే కనిపించాడో ఆ రేంజ్ బలమైన పాత్రలో ఫుల్ లెంగ్త్ లో తారక్ వార్ 2 లో కనిపించనున్నాడని చెప్పాలి.

Exit mobile version