“కన్నప్ప” కి ప్రభాస్ రెమ్యునరేషన్ పై క్లారిటీ!

“కన్నప్ప” కి ప్రభాస్ రెమ్యునరేషన్ పై క్లారిటీ!

Published on May 15, 2024 8:58 AM IST


డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ ఎంతగా వైరల్ అవుతోందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు అని మేకర్స్ నుండి అప్డేట్ రావడం తో సినిమా పై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ప్రభాస్ రోల్ ఏమిటనేది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ చిత్రం కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా దానిపై ఒక క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఎలాంటి రెమ్యునరేషన్ ఛార్జ్ చేయడం లేదు అని తెలుస్తోంది. చాలా తక్కువ రోజులు ఈ చిత్రం కోసం ప్రభాస్ కేటాయించాడు అని సమాచారం.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ లో మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, మోహన్ బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన ఈ కన్నప్పను మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్‌గా ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీతో సహా ఆకట్టుకునే అద్భుతమైన టీం పనిచేస్తోంది. ఆకర్షణీయమైన విజువల్స్, అద్భుతమైన కథ, కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు