The Raja Saab: ప్రభాస్ “రాజా సాబ్” టీజర్ పై క్లారిటీ

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో దర్శకుడు మారుతీతో చేస్తున్న క్రేజీ హారర్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం “ది రాజా సాబ్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ భారీ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా పూర్తవుతుండగా ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ అలాగే ఫస్ట్ లుక్స్ పోస్టర్ లకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే రీసెంట్ గా ఈ చిత్రం తాలూకా టీజర్ ఈ అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్ డే కానుకగా తీసుకొస్తున్నారు అంటూ ఇపుడు నుంచే వార్తలు కొన్ని వైరల్ గా మారాయి. అయితే దీనిపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఇవి అన్నీ అవాస్తం అంటూ మారుతీ ఫ్రెండ్, మన టాలీవుడ్ యువ ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ కన్ఫర్మ్ చేసేసారు. సో ప్రభాస్ బర్త్ డే కి రాజా సాబ్ టీజర్ వస్తుంది అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version