నితిన్ “తమ్ముడు” లో పవన్ సాంగ్ రీమిక్స్…క్లారిటీ ఇదే!

నితిన్ “తమ్ముడు” లో పవన్ సాంగ్ రీమిక్స్…క్లారిటీ ఇదే!

Published on Jul 26, 2024 11:00 PM IST

నితిన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తమ్ముడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2024లో విడుదల కానుంది. నితిన్ తన సినిమాలో సూపర్ హిట్ అయిన పవన్ కళ్యాణ్ పాటను రీమిక్స్ చేయనున్నాడని గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే ఈ వార్త ఫేక్ అని, అందులో ఎలాంటి నిజం లేదని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

మీడియా సర్కిల్‌లో కూడా కొందరు ఈ వార్తలు పుకార్లే అంటూ చెప్పుకొచ్చారు. ఆల్బమ్‌లో అన్ని ఒరిజినల్ పాటలు ఉంటాయని చెప్పారు. లయ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో కాంతార ఫేమ్ సప్తమి గౌడ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు