ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ వసూళ్ళతో అదరగొడుతున్న చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కించిన మొదటి సినిమా ఇది కావడంతో మంచి హైప్ ని ఈ సినిమా అందుకుంది.
అయితే నీల్ మొదటి సినిమా “ఉగ్రం” ని గ్రాండ్ లెవెల్ లో అప్ గ్రేడ్ చేసి ప్లాన్ చేసి తెరకెక్కించగా దాని కన్నా దీని కన్నా నెక్స్ట్ లెవెల్ హైప్ అండ్ రీచ్ ని అందుకుంది. అయితే ఈ చిత్రం ఓటిటి రిలీజ్ అంటూ కొన్ని రూమర్స్ ఇప్పుడు బాగా స్పెక్యులేట్ అవుతున్నాయి. ఎప్పుడో కాదు జస్ట్ ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12నే వచ్చేస్తుంది అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే దీనిపై క్లారిటీ వినిపిస్తుంది. ఈ చిత్రం జనవరిలోనే వస్తుంది అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదట. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం సలార్ జనవరి రిలీజ్ కి రాదని కన్ఫర్మ్ అయ్యింది. సో సలార్ జనవరి ఓటిటి రిలీజ్ అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి.