లాక్ డౌన్ రివ్యూ : క్లాస్ ఆఫ్ 83 – హిందీ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో

లాక్ డౌన్ రివ్యూ : క్లాస్ ఆఫ్ 83 – హిందీ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో

Published on Aug 23, 2020 3:57 PM IST

నటీనటులు: బాబీ డియోల్

దర్శకత్వం: అతుల్ సభర్వాల్

నిర్మాతలు: గౌరీ ఖాన్, షారూఖ్ ఖాన్, గౌరవ్ వర్మ

సంగీతం : విజు షా

సినిమాటోగ్రఫీ : మేరియో పోల్జాక్

ఎడిటింగ్ : మానస్ మిట్టల్

ఈ లాక్డౌన్ సమయంలో పలు చిత్రాలు మరియు సిరీస్ ల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో నేడు మేము ఎంచుకున్న చిత్రం “83”. బాలీవుడ్ కు చెందిన ఈ చిత్రం దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది, మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

1980ల కాలానికి చెందిన ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ విజయ్ సింగ్(బాబీ డియోల్) నాసిక్ లోకి ఒక పోలీస్ అధికారిగా నియమించబడతాడు. అలా నియమించబడ్డ ఇతను అక్కడ ఒక ఐదుగురు యువకులను విప్లవం కోసం రగులుతున్న వారిని గుర్తించి వారికి సెపరేట్ గా ఒక ట్రైనింగ్ ఇస్తాడు. ఈయన ఇలా వారిని ఎందుకు ఎంచుకున్నాడు? వీరి వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి వీరికి ఇచ్చిన మిషన్ ఏమిటి? ఈ ఐదుగురు యువ పోలీసులు ఏం చేసారు మిషన్ ఏమయ్యింది అన్నది అసలు కథ.

 

ఏమి బాగుంది?

 

ఈ చిత్రానికి మెజా ప్లస్ పాయింట్ ఏమిటంటే ఇప్పటికే మంచి గుర్తింపు పొందిన రచన 83 పుస్తకం నుంచి తీసుకున్నది కాబడం. అలాగే మెయిన్ లీడ్ లో కనిపించిన బాబీ డియోల్ మంచి నటనను కనబరిచారు. ఒక యంగ్ హీరో నుంచి పరిణితి చెందిన రోల్ వరకు ఈ హీరో మంచి చేంజోవర్ ఇచ్చాడని చెప్పాలి.అంతే కాకుండా బాబీ డియోల్ ఎమోషనల్ పెర్ఫామెన్స్ మరో ఎస్సెట్ అని చెప్పాలి.

అలాగే ఈ చిత్రంలో అప్పటి నేటివిటీకి తగ్గట్టుగా ముంబై పరిసరాలను అద్భుతంగా చూపించారు.వీటితో పాటుగా అక్కడి అండర్ వరల్డ్ సన్నివేశాలు మరియు లోకల్ డాన్స్ ను చూపిన విధానం రియలిస్టిక్ గా ఉంటుంది. అంతే కాకుండా ఈ చిత్రంలో మరో మెయిన్ లీడ్స్ లో కనిపించిన ఐదుగురు యువ ప్రధాన పాత్రదారులు మంచి నటనను కనబరిచారు. అలాగే క్యాస్టింగ్ కానీ మ్యూజిక్ మరియు షారుక్ ఖాన్ అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

 

ఏమి బాలేదు?

 

ఇలాంటి చిత్రాల్లో బ్రిలియెన్స్ అనేది చాలా ముఖ్యం కానీ కథనంలో అందుకు ఈ చిత్రంలో ఆస్కారం ఉన్నా అంతగా అది ఎలివేట్ అయ్యినట్టు అనిపించదు. అలాగే ఆ ఐదుగురుకి ఇచ్చిన ట్రైనింగ్ ఎపిసోడ్స్ బాగానే అనిపించినా తర్వాత వారిని ఆ మిషన్ లోకి ఇన్వాల్వ్ చేసిన తీరు అంతగా ఆకట్టుకోదు.

అలాగే ముందు చెప్పుకున్నట్టుగా దర్శకుడు అతుల్ సబర్వాల్ ఒక సాలిడ్ కంటెంట్ ను ఎంచుకున్నా దానిని తెరకెక్కించిన విధానంలో ఇంకా మెరుగైన ప్రదర్శన చూపాల్సింది. అలాగే సినిమా అంతా ఒక హైప్ లో వెళ్తున్న సమయంలో క్లైమాక్స్ నుంచి ఇచ్చిన ఎండింగ్ అంతగా ప్రేక్షకులకు ఆకట్టుకోకపోవచ్చు.

అలాగే ఎంతో కీలకం అయిన ఎమోషన్స్ కూడా పలు చోట్ల అంతగా ఆకట్టుకోవు. అందుకు కారణం సరైన స్క్రీన్ ప్లే లేకపోవడం అని కూడా చెప్పొచ్చు. ఈ అంశాల్లో దర్శకుడు జాగ్రత్త వహించి ఉండాల్సింది.

 

చివరి మాటగా :

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ 83 అనే పోలీస్ డ్రామా నటీనటుల పెర్ఫామెన్స్ లు, చిత్రంలో చూపిన కొన్ని రియలిస్టిక్ సీన్స్ అలాగే నిర్మాణ విలువలు కానీ బాబీ డియోల్ పై చూపించిన ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. కానీ ఈ చిత్రంలో సరైన కథనం లేకపోవడం అలాగే సినిమాకు కీలకం అయిన క్లైమాక్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా లేకపోవడం వంటివి దెబ్బ తీశాయి. సో ఈ చిత్రాన్ని ఈ లాక్ డౌన్ లో ఓసారి చూడొచ్చు.

Rating: 2.5/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు