‘అర్జున్ S/O వైజయంతి’ క్లైమాక్స్ చూసి షాక్ అవుతారు – విజయశాంతి

‘అర్జున్ S/O వైజయంతి’ క్లైమాక్స్ చూసి షాక్ అవుతారు – విజయశాంతి

Published on Apr 12, 2025 11:02 PM IST

టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘అర్జున్ S/O వైజయంతి’ చిత్రం ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేయగా పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తల్లికొడుకుల మధ్య సాగే ఈ ఎమోషన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీకి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా వచ్చాడు.

ఇక ఈ ఈవెంట్‌లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాపై పూర్తి కాన్ఫిడెంట్‌ను వ్యక్తం చేశారు. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి పక్కా కమర్షియల్ చిత్రంగా తెరకెక్కించారని.. అయితే, తల్లికొడుకుల మధ్య బంధాన్ని ఆయన చాలా చక్కగా చూపెట్టారని విజయశాంతి అన్నారు. కొడుకు తప్పు బాటలో వెళ్తుంతే ఏ తల్లి అయినా, అతడిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తుందని.. ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రలో తాను నటించానని.. అలా కొడుకుల కోసం ఏదైనా చేసే తల్లులకు ఈ చిత్రం అంకితం చేస్తున్నామని అన్నారు.

కాగా, ఈ సినిమాలోని క్లైమాక్స్ ప్రతి తల్లిని హత్తుకునే విధంగా ఉంటుందని.. ఈ క్లైమాక్స్ చూసి అందరూ షాక్ అవుతారని విజయశాంతి అన్నారు. ఇలా ఈ సినిమాపై అంచనాలను విజయశాంతి మరింతగా పెంచారు. దీంతో ఈ సినిమాలోని క్లైమాక్స్ ఏమై ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. సాయి మంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ఏప్రిల్ 18న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు