‘బచ్చల మల్లి’కి అదే హైలైట్ కానుందట..!

‘బచ్చల మల్లి’కి అదే హైలైట్ కానుందట..!

Published on Dec 17, 2024 2:01 AM IST

హీరో అల్లరి నరేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బచ్చల మల్లి’ డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో అల్లరి నరేష్ మరోసారి తనలోని వెర్సటైల్ యాక్టర్‌ను మనకు చూపించబోతున్నాడు. సీరియస్‌గా సాగే పాత్రలో అల్లరి నరేష్ నటన నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని మేకర్స్ ఇప్పటికే తెలిపారు. ఇక ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ కూడా ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది.

అయితే, ఈ సినిమాకు కీలకంగా ఉన్న అంశం ఏమిటనే విషయం పై తాజాగా ఓ వార్త వినిపిస్తోంది. ‘బచ్చల మల్లి’లో కావాల్సినంత యాక్షన్, లవ్, మాస్ అంశాలు ఉండనున్నాయి. కానీ, ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచేది మాత్రం ఈ మూవీ క్లైమాక్స్ అని తెలుస్తోంది. ఈ చిత్ర క్లైమాక్స్‌లోని ఎమోషన్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని మూవీ టీమ్ చెబుతోంది. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌ని చిత్ర యూనిట్ బలమైన ఎమోషనల్ కథతో నింపారని.. ఈ క్లైమాక్స్ చూసిన ఆడియెన్స్ థియేటర్స్ నుంచి బయటకు వచ్చాక కూడా దాని గురించి చర్చించుకుంటారని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.

ఇక ఈ క్లైమాక్స్ పోర్షన్‌లో అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. ప్రేక్షకులను ఆయన ఏడిపించడం ఖాయమని చిత్ర యూనిట్ తెలిపింది. మొత్తానికి ‘బచ్చల మల్లి’ చిత్రానికి క్లైమాక్స్ మేజర్ హైలైట్‌గా నిలవనుందనే వార్తతో ఈ సినిమాపై ఆసక్తి మరింతగా పెరుగుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు