గ్రాండ్‌గా “సీఎం పెళ్లాం” టీజర్ రిలీజ్ ఈవెంట్

గ్రాండ్‌గా “సీఎం పెళ్లాం” టీజర్ రిలీజ్ ఈవెంట్

Published on Sep 16, 2024 10:47 AM IST

జయసుధ, సుమన్, ఇంద్రజ, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “సీఎం పెళ్లాం”. ఈ చిత్రాన్ని ఆర్.కే సినిమాస్ బ్యానర్‌పై బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్నారు. దర్శకుడు గడ్డం వెంకట రమణరెడ్డి రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో “సీఎం పెళ్లాం” సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ రోజు మా సినిమా ‘సీఎం పెళ్లాం’ టీజర్ లాంఛ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. రాజకీయ నేపథ్యంతో సాగే మంచి సందేశాత్మక చిత్రమిది. ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూనే ఆలోచింపజేస్తుంది. మనం ఒకే ఒక్కడు సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి కావడం చూశాం. మా మూవీలో సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేసేందుకు ముందుకొస్తే ఎలా ఉంటుందనేది చూపిస్తున్నాం. చాలా మంచి ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా.’ అని అన్నారు.

నిర్మాత బొల్లా రామకృష్ణ మాట్లాడుతూ.. ‘దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి గారు ఒక మంచి స్క్రిప్ట్ నాకు వినిపించారు. వెంటనే మూవీ స్టార్ట్ చేశాం. రాజకీయ నేపథ్యంతో సాగే సినిమా ఇది. మహిళా సాధికారత గురించి కూడా కంటెంట్ ఉంటుంది. సుమన్ గారు, ఇంద్రజ, అజయ్ గారితో మూవీ చేయడం హ్యాపీగా ఉంది. ఒక మంచి ప్రయత్నం చేశాం. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం.’ అని అన్నారు.

నటుడు సుమన్ మాట్లాడుతూ – సీఎం పెళ్లాం సినిమాలో నేను పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను. రొటీన్ కు భిన్నమైన పాత్రలో కనిపిస్తా. చాలా మంచి స్క్రిప్ట్ ఇది. డైరెక్టర్ వెంకటరమణారెడ్డి పూర్తి స్క్రిప్ట్ తో ప్రతి డీటెయిల్ తో రెడీ అయ్యి సినిమా చేశారు. ఆయన డెడికేషన్ నాకు నచ్చింది. నాతో పాటు ఇంద్రజ, అజయ్ ప్రధాన పాత్రలు చేశారు. అజయ్ మంచి నటుడు, అతను ఇంకా గొప్ప పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. ఇంద్రజ గతంలో నాతో పాటు హీరోయిన్ గా నటించింది. ఆమెతో మళ్లీ మూవీ చేయడం హ్యాపీగా ఉంది. చాలా మంచి ఆర్టిస్టులు ఈ సినిమాకు కుదిరారు. మన రాజకీయ, బ్యూరోక్రాట్ వ్యవస్థను ప్రశ్నిస్తూ ఒక మంచి మూవీ చేశారు దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి. ఈ సినిమాకు మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

నటి ఇంద్రజ మాట్లాడుతూ.. ‘సుమన్ గారితో ఎన్నో మూవీస్ చేశాను. ఆయన మంచి మనసు అప్పుడు ఇప్పుడూ ఒకేలా ఉంది. ఆయన అప్పటికే స్టార్ హీరో అయినా కొత్త హీరోయిన్‌గా వచ్చిన నాతో ఎంతో గౌరవంగా మాట్లాడేవారు. సీఎం పెళ్లాం క్యారెక్టర్‌లో సీఎం భార్య పాత్రలో నటించాను. ఈ పాత్రను నేను చేయగలను అని నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు గడ్డం వెంకటరమణరెడ్డికి థ్యాంక్స్ చెబుతున్నా. ఇదొక ప్రత్యేకమైన సినిమా. మంచి సందేశాన్ని ఇస్తుంది. దర్శకుడు బౌండెడ్ స్క్రిప్ట్ తో రూపొందించారు. ఈ సినిమాలో అజయ్ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ టీజర్ లాంఛ్ కు వచ్చి సపోర్ట్ చేస్తున్న అలీ గారికి థ్యాంక్స్. అలాగే ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా.’ అని అన్నారు.

నటుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నేను హోం మంత్రి పాత్రలో నటించాను. పొలిటికల్ నేపథ్యంతో సాగే ఒక మంచి చిత్రమిది. ఈ చిత్రంలో ఇంద్రజ, సుమన్, అజయ్ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. డైరెక్టర్ గడ్డం వెంకటరమణ రెడ్డి గారికి, ప్రొడ్యూసర్ బొల్లా రామకృష్ణ గారికి థ్యాంక్స్.’ అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు