విడుదల తేదీ : జనవరి 31, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : టెంపర్ రవి, రవిబాబు, శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్, బెనర్జీ, జెమినీ సురేష్, రామ్ ప్రసాద్, ఎన్ పి ఆర్, శ్రీ సుధ తదితరులు.
దర్శకత్వం : ఆర్.పి.పట్నాయక్
నిర్మాత : సెవెన్ హిల్స్ సతీష్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ : భరత్ మధుసూధన్
ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ : అనుష్ గోరక్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఇప్పుడు సినిమాలు థియేటర్స్ తో పాటుగా పలు ఓటిటిలో కూడా పలు సిరీస్ లు సినిమాలు అలరించేందుకు వస్తున్నాయి. అలా మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ కి వచ్చిన ఒరిజినల్ సినిమానే “కాఫీ విత్ ఏ కిల్లర్”. ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
ఒక ప్రొఫిషినల్ కిల్లర్ అయినటువంటి(టెంపర్ రవి) తన కమిట్మెంట్స్ లో భాగంగా సుపారీకి మరో కాంట్రాక్టు ఒప్పుకుంటాడు. ఎవరో అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చిన ఆఫర్ తో ఓ కాఫీ కేఫ్ లో మర్డర్ చేయాల్సి ఉంటుంది. దీనితో ఆ కేఫ్ కి వచ్చిన టెంపర్ రవితో పాటుగా చాలా మంది సినిమా కోసం అని రవిబాబు, సత్యం రాజేష్, శ్రీనివాస రెడ్డి, జాతకాలు అంటూ తాగుబోతు రమేష్ ఇలా వేరే వేరేగా తమ సెటిల్మెంట్స్ అని, పర్శనల్ సమస్యలు అని ఇలా ఒకరి లైఫ్ తో ఇంకొకరి లైఫ్ కథలు పార్లల్ గా జరుగుతుంటాయి. మరి ఆ కాంట్రాక్టు కిల్లర్ ఎవరిని చంపడానికి వచ్చాడు? కానీ చివరికి తనకి డీల్ ఇచ్చిన అతన్నే ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది తెలియాలి అంటే ఈ ఒరిజినల్ సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాలో థీమ్ డీసెంట్ గా ఉందని చెప్పవచ్చు. కేవలం ఒకే కాఫీ షాప్ సెటప్ లో పార్లల్ గా జరిగే కొంతమంది జీవితాలు వాటిలో ఎవరిది వారికి ముఖ్యమే అందులో సస్పెన్స్ అండ్ థ్రిల్ ఫాక్టర్ ని జోడించడం బాగుంది. అలాగే లీడ్ నటీనటుల్లో ముఖ్యంగా ఒకొక్కరికీ ఒకో ట్రాక్ కనిపిస్తుంది.
శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్ లపై నడిచే ట్రాక్ లో వారు మంచి నటన కనబరిచారు. అలాగే జాతకం టేబుల్ దగ్గర తాగుబోతు రమేష్ ఫన్ రోల్ చేసాడు. ఇంకా జెమిని సురేష్ అండ్ రామ్ ప్రసాద్ ల నడుమ మంచి కామెడీ జెనరేట్ అయ్యింది. వారి మధ్య ట్రాక్స్ బాగున్నాయి. అలాగే టెంపర్ రవి మరోసారి నెగిటివ్ రోల్ లో షైన్ అయ్యాడని చెప్పొచ్చు.
వీరితో పాటుగా ఎన్ పి ఆర్ అలాగే, శ్రీ సుధాలు తమ రోల్స్ లో సెట్ అయ్యారు బాగానే చేశారు. అలాగే సినిమాలో అక్కడక్కడా సస్పెన్స్ గా సాగే కథనం డీసెంట్ గా సాగుతూ మంచి థ్రిల్ గా అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్ట్ లు బాగున్నాయి.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో లైన్ బాగున్నప్పటికీ ఇంకా బెటర్ గా కథనం నడిపించాల్సి ఉంది. మెయిన్ నటుల్లో శ్రీనివాసరెడ్డి, రవిబాబు, సత్యం రాజేష్ ల ట్రాక్ ఇంట్రెస్టింగ్ గా వీక్ గా కనిపిస్తుంది. సినిమా తీయడం అందులో పేలని జోకులు, ఒకో పదానికి సత్యం రాజేష్ ఇచ్చే వివరణ లాంటి చాలా సినిమాల్లో మెయిన్ గా ఏవో స్కిట్స్ లో చూసేసినట్టు అనిపిస్తాయి. ఇలా కొన్ని కామెడీ సీన్స్ మాత్రం అంతగా పండలేదు.
అలాగే ఈ సినిమాని ఎలాగో మరీ లెంగ్త్ గా ప్లాన్ చెయ్యలేదు కానీ ఉన్నంతలో కూడా ఇంకొంచెం ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే సెట్ చేసి ఉంటే బాగుండేది. సస్పెన్స్ ఫాక్టర్ ని రివీల్ చేయడానికి ఇంత సాగదీత అవసరమా అనిపించక మానదు. అలాగే సినిమా టేబుల్ ట్రాక్ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. టెంపర్ రవి ట్రాక్ ని హోల్డ్ లో ఉంచడానికి ఇతర ట్రాక్స్ హవాలా, ఓ సెటిల్మెంట్ ట్రాక్ ఇలాంటివి అన్నీ అవసరం లేదు అనిపిస్తాయి.
కొంచెం నోటెడ్ నటుల్ని పెట్టుకున్నప్పుడు వారికి ప్రాధాన్యత ఉండేలా మంచి ట్రాక్ ని రెడీ చేయాల్సింది. ఇలా ఓ సస్పెన్స్ ని దాచి ఉంచడానికి మిగతా అన్నీ కొంచెం అవుట్ డేటెడ్ గా లాస్ట్ లో ప్రతీ ట్రాక్ కి ఇచ్చిన ఎండింగ్ లు లాంటివి ఆల్రెడీ చూసిన విధంగానే రొటీన్ ఫీల్ కలిగిస్తాయి. సో ఇలాంటివి అన్నీ ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అనుష్ గోరక్ అందించగా తన కెమెరా పనితనం బాగుంది కానీ ఎడిటింగ్ ఇంతా బెటర్ గా చేయాల్సింది. అలాగే సంగీతం చాలా యావరేజ్ గా ఉంది.
ఇక దర్శకుడు ఆర్పీ పట్నాయక్ విషయానికి వస్తే తాను కొంచెం కొత్త ప్రయత్నం చేద్దాం అనుకున్నట్టు ఉన్నారు కానీ ఇందులో ఇంకా డెప్త్ గా ప్లాన్ చేయాల్సింది. చాలా సబ్ ప్లాట్స్ తాను పెట్టుకున్నారు కానీ అన్నీ ఇందులో ఎంగేజింగ్ గా లేవు. ఏవో కొన్ని కామెడీ సీన్స్ టెంపర్ రవి థ్రిల్లర్ లైన్ తప్ప మిగతా అంతా ఇంకా మెరుగ్గా తీర్చి దిద్ది ఉంటే మరింత ఎంటర్టైనింగ్ గా ఉండి ఉండొచ్చు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “కాఫీ విత్ ఏ కిల్లర్” లో లైన్ బాగుంది. అలాగే కొన్ని కామెడీ సీన్స్ ఇంకా సస్పెన్స్ అంశాలు కూడా మరీ బోర్ కొట్టనివ్వకుండా డీసెంట్ గా సాగుతాయి. అయితే కొన్ని సబ్ ప్లాట్స్ కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఏమన్నా ఉండుంటే ఈ సినిమా మరింత ఎంగేజింగ్ గా ఉండేది. వీటితో ఓటిటిలో ఈ థ్రిల్లర్ ఓ మాదిరిగా ఓకే అనిపిస్తుంది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team