‘కార్తికేయ – 2 ‘లో ఆమెది గెస్ట్ రోల్ !

Published on Aug 15, 2020 9:00 am IST

టాలెటెండ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ‘కార్తికేయ – 2 ‘ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా నుండి తప్పుకుందని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నా.. చిత్రబృందం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కాగా ‘కార్తికేయలో హీరోయిన్ గా నటించిన కలర్స్ స్వాతి… ‘కార్తికేయ 2’లోనూ నటించబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు అది నిజమేనని తెలుస్తోంది.

అయితే కలర్స్ స్వాతి ‘కార్తికేయ 2’లో హీరోయిన్ కాదట. జస్ట్ గెస్ట్ రోల్ లో మాత్రమే కనిపిస్తోందని సమాచారం. మొత్తానికి కలర్స్ స్వాతి తన హిట్ సినిమాతోనే మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతుందన్నమాట. ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. కాగా స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే హిస్టారికల్ కి సంబంధించిన ఓ కాస్పెక్ట్ హైలెట్ అవునున్నాయట.

పైగా సినిమాలో ఎక్కడా ఎంటర్ టైన్మెంట్ తగ్గకుండా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాగు ‘కార్తికేయ’ సినిమాతోనే డైరెక్టర్ గా మంచి డిమాండ్ తెచ్చుకున్న చందు.. మళ్ళీ నిఖిల్ తో ‘కార్తికేయ 2’ తీసి… తిరిగి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More