ఎన్టీఆర్ ను పెద్దన్నయ్య అని పిలుస్తాను

ఎన్టీఆర్ ను పెద్దన్నయ్య అని పిలుస్తాను

Published on Mar 11, 2023 11:00 PM IST

హాస్య నటుడు రోలర్ రఘు తనదైన హాస్యంతో తెలుగు తెర పై బాగానే నవ్వులు పండించారు. ముఖ్యంగా తనదైన యాసలో రోలర్ రఘు డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది. అందరికి నచ్చుతుంది. ఐతే, తాజాగా రోలర్ రఘు ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇంతకీ, రోలర్ రఘు ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడాడు అంటే.. ఎన్టీఆర్ కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం. ముందు నుంచి ఎన్టీఆర్ తో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది అని అన్నారు.

అలాగే, రోలర్ రఘు ఇంకా మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పెళ్లికి ముందు మేమంతా కలిసి సరదాగా తిరిగేవాళ్లం. ఎన్టీఆర్ కూడా తన స్నేహితులను కూడా కుటుంబ సభ్యుల మాదిరిగానే చూసుకుంటారు. నేను ఎన్టీఆర్ ను పెద్దన్నయ్య అని పిలుస్తాను. తన సినిమాల్లో మేము చేసే పాత్రలు ఏమైనా ఉంటే అవి మాకే వస్తాయి. అంతేగానీ ఫలానా పాత్రలో మా ఫ్రెండ్ ను పెట్టుకోమని ఎన్టీఆర్ సిఫార్స్ చేయరు. పాత్రకి తగిన నటులు ఉండాలనేదే ఎన్టీఆర్ అభిప్రాయం’ అని రోలర్ రఘు చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు