సునీల్ అన్నయ్యను చూసే ఇన్స్పైర్ అయ్యాను – సత్య

సునీల్ అన్నయ్యను చూసే ఇన్స్పైర్ అయ్యాను – సత్య

Published on Sep 15, 2024 4:00 PM IST

సెప్టెంబర్ 13 వ తేదీన రిలీజ్ అయిన మత్తు వదలరా 2 చిత్రం ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫన్ రైడ్ తో ఆకట్టుకుంటుంది అని ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కూడా తెలిపారు. అయితే ఈ చిత్రంలో శ్రీ సింహ కోడూరి తో పాటుగా, ప్రధాన పాత్రలో నటించిన కమెడియన్ సత్య పాత్ర పై ఆడియెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అయితే సక్సెస్ మీట్ లో సునీల్ తనకు ఇన్స్పిరేషన్ అని సత్య తెలిపాడు. తనకు చాలా వరకు సునీల్ సలహాలు ఇచ్చాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సునీల్, ఫరియా అబ్దుల్లా లు కీలక పాత్రల్లో నటించారు. క్లాప్ ఎంటర్ టైన్మెంట్ మరియు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించాడు. ఈ చిత్రం లాంగ్ రన్ లో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు