50 రోజుల కమిటీ కుర్రోళ్ళు.. స్పెషల్ షోకు చిత్ర టీమ్!


మెగా డాటర్ నిహారిక నిర్మాతగా మారి చేసిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మంచి విజయం సాధించింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో నిర్మాతగా నిహారిక మంచి పేరుని తెచ్చుకుంది.

ఇక ఈ సినిమాను దర్శకుడు యదు వంశీ డైరెక్ట్ చేయగా, కొత్త నటీనటులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కూడా అవుతుంది. అయితే, ఈ సినిమా ఇప్పుడు 50 రోజుల థియేట్రికల్ రన్‌ను జరుపుకునేందుకు సిద్ధమయ్యింది. సెప్టెంబర్ 26న ఈ సినిమా 50 రోజుల రన్ పూర్తి చేసుకోనుంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని మైత్రీ విమల్ థియేటర్‌లో స్పెషల్ షో వేస్తున్నారు. ఈ స్పెషల్ షోను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్ర టీమ్‌తో వీక్షించవచ్చని మేకర్స్ తెలిపారు.

Exit mobile version