ఇప్పటికీ ‘కమిటీ కుర్రోళ్ళు’ హవా..2 వారాల వసూళ్లు, 3వ వారంకి మరిన్ని స్క్రీన్లు

ఇప్పటికీ ‘కమిటీ కుర్రోళ్ళు’ హవా..2 వారాల వసూళ్లు, 3వ వారంకి మరిన్ని స్క్రీన్లు

Published on Aug 23, 2024 3:00 PM IST


రీసెంట్ గా మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వచ్చి మంచి హిట్ అయ్యిన చిత్రాల్లో యూత్ ఫుల్ నోస్టాల్జిక్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “కమిటీ కుర్రోళ్లు” కూడా ఒకటి. యువ దర్శకుడు యదు వంశీ తెరకెక్కించిన ఈ సినిమాలో ఎంతోమంది యువ నటీనటులు కనిపించగా యూట్యూబ్ ఫేమ్ ప్రసాద్ బెహరా కూడా కనిపించాడు. మరి ఇలా డీసెంట్ బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం పైడ్ ప్రీమియర్స్ నుంచే సాలిడ్ టాక్ ని అందుకొని అక్కడ నుంచి మంచి వసూళ్లు కూడా ఈ చిత్రం సాధించింది.

ఇలా రెండు వారాల రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇపుడు సక్సెస్ ఫుల్ గా మూడో వారం లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ రెండు వారాల్లో ఈ చిత్రం మొత్తం 15.6 కోట్ల గ్రాస్ ని అందుకుని అదరగొట్టింది. అలాగే ఈ రెండు వారాల తర్వాత మూడో వారం మరింత స్ట్రాంగ్ రన్ ని ఈ చిత్రం నమోదు చేస్తుందట. మూడో వారంలో ఈ చిత్రానికి మరిన్ని స్క్రీన్స్ యాడ్ చేస్తుండగా ఇప్పటికీ ఈ సినిమా అదరగొడుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణం వహించగా అనుదీప్ దేవ్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు