సమీక్ష: “కమిటీ కుర్రోళ్ళు” – ఆకట్టుకునే యూత్ ఫుల్ ఎంటర్టైనర్

Committie Kurrollu Movie Review in Telugu

విడుదల తేదీ : ఆగస్టు 09, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాధ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వీ రావు, టీన శ్రావ్య, విశిక, షణ్ముఖి నాగుమంత్రీ, సాయి కుమార్, రమణ రాజు గోపరాజు, కిషోర్ కుమార్

దర్శకుడు: యదు వంశీ

నిర్మాతలు : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్

సంగీత దర్శకుడు: అనుదీప్ దేవ్

సినిమాటోగ్రఫీ: ఎదురురోలు రాజు

ఎడిట‌ర్ : అన్వర్ అలీ

సంబంధిత లింక్స్: ట్రైలర్

మెగా డాటర్ నిహారిక నిర్మాతగా యువ నటీనటుల కలయికలో చేసిన లేటెస్ట్ చిత్రమే “కమిటీ కుర్రోళ్ళు”. దర్శకుడు యదు వంశీ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి బజ్ ని సంతరించుకొని రిలీజ్ కి వచ్చింది. మరి ఈ చిత్రం అంచనాలు అందుకుందో లేదో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ:

ఇక కథలోకి వస్తే.. పశ్చిమ గోదావరి ప్రాంతంలో పురుషోత్తపల్లి అనే చిన్న గ్రామంలో ఎప్పుడు నుంచో ఆనవాయితీగా జరుగుతూ వచ్చే బరింకలమ్మ జాతర ఈసారి అయినా చెయ్యాలని ఆ తర్వాత 10 రోజుల్లోనే వచ్చే ఎన్నికలు కూడా సజావుగా చేయాలని ఊరి పెద్దలు అక్కడి సర్పంచ్ పొలిశెట్టి బుజ్జి (సాయి కుమార్) అతనిపై ఈసారి ఎన్నికల్లో గలవాలని ఆ ఊరి మాజీ సర్పంచ్ కొడుకు శివ (సందీప్ సరోజ్) ఊరి కొందరు సమక్షంలో మాట్లాడ్డం జరుగుతుంది. కానీ అక్కడ ఆనవాయితీ ప్రకారం సత్తయ్య (కిశోర్ కుమార్) చేతుల మీదుగానే జరగాల్సి ఉంటుంది. కానీ అతను గత పన్నెండేళ్ల కితం తన జీవితంలో జరిగిన ఓ విషాదం మూలాన ఊరి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. మరి ఇంతకీ ఆ ఊరిలో ఏం జరిగింది? శివ తన ఫ్రెండ్స్ అంతా కలిసి ఆ ఊర్లో ఏం చేశారు. చివరికి ఆ ఊర్లో జాతర జరిగిందా లేదా? ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

మొదటిగా ఈ చిత్రంలో కనిపించిన ప్రతి యంగ్ స్టర్ అదరగొట్టారు అని చెప్పాలి. సందీప్ సరోజ్ చేసిన శివ పాత్ర నుంచి తమ స్నేహితుల్లో కనిపించిన ప్రతి ఒక్క నటుడు సాలిడ్ పెర్ఫామెన్స్ ని అందించారని చెప్పాలి. అలాగే ఒకో ప్రధాన పాత్రదారుడికి జోడిగా కనిపించిన యంగ్ హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. మెయిన్ గా ఒకో నటీనటున్ని కాలానికి అనుగుణంగా ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది.

ఇక వీరి అందరి మీద సరదాగా నడిచే ఫస్టాఫ్ అయితే ఆద్యంతం అలరిస్తుంది. ముఖ్యంగా ఈ సీన్స్ లో చాలా వాటికి 90స్ కిడ్స్ బాగా కనెక్ట్ అవుతారని చెప్పొచ్చు. ఇంకా లీడ్ నటీనటుల్లో యూట్యూబ్ ఫేమ్ ప్రసాద్ బెహరాకి మంచి పాత్ర దక్కగా సాలిడ్ ఎమోషన్స్ తో తన రోల్ ని పండించాడు అని చెప్పాలి. అలాగే సినిమాలో ప్రొసీడింగ్స్ కూడా ఇంప్రెస్ చేస్తాయని చెప్పాలి. కథని ఫన్ స్టేజ్ నుంచి సీరియస్ టోన్ లోకి తీసుకెళ్లడం ఎక్కడా బోర్ లేకుండా ఫస్టాఫ్ ని కొనసాగించడం బాగుంది.

ఇంకా ఒక బ్యాచ్ ఫ్రెండ్స్ లో ఉండే కొన్ని కలహాలు, స్పర్థలు ఈ చిత్రంలో బాగా చూపించారు. వాటితో పాటుగా సెకండాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ కదిలిస్తాయని చెప్పాలి. ఇక ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన సాయి కుమార్, గోపరాజు రమణ రాజు, ముఖ్యంగా కిషోర్ కుమార్ సాలిడ్ పెర్ఫామెన్స్ ని అందించారు. ఇలా నటీనటుల్లో అయితే అంతా తమ బెస్ట్ ని ఈ చిత్రంలో అందించేసారు.

 

మైనస్ పాయింట్స్:

ఒక ఎంగేజింగ్ ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ కూడా డీసెంట్ గానే మొదలవుతుంది కానీ కొన్ని చోట్ల మాత్రం సినిమా కొంచెం రొటీన్ గానే అనిపిస్తుంది. అలాగే సినిమాలో బలమైన కథ కూడా లేదు. అలాగే ఎన్నికల రిలేటడ్ సన్నివేశాలు చూస్తే ఈ బ్యాక్ డ్రాప్ లో ఆల్రెడీ కొన్ని చూసేసిన సినిమాలు గుర్తుకొస్తాయి.

ఇంకా సినిమాలో మరీ ఎంగేజ్ చేసేసే పెద్ద ట్విస్ట్ లు కూడా లేవు. ఇలాంటి వాటిని ఈ విలేజ్ డ్రామాస్ లో ఆశించేవారు కొంచెం డిజప్పాయింట్ అవ్వవచ్చు. అలాగే సాయి కుమార్ రోల్ ని ఇంకాస్త పవర్ఫుల్ గా ఏమన్నా ప్రెజెంట్ చేయాల్సింది. వీటితో పాటుగా సెకండాఫ్ లోనే అక్కడక్కడా కొన్ని సీన్స్ కొంచెం అసహజంగా అనిపిస్తాయి.

 

సాంకేతిక వర్గం:

ఇలాంటి సినిమాని ఎంచుకోవడంలో నిహారికకి మాత్రం మంచి మార్కులు ఇవ్వాల్సిందే. అలాగే ఈ సినిమాకి తగ్గట్టుగా మంచి నిర్మాణ విలువలు ఆమె అందించింది అని చెప్పాలి. ఈ సినిమా టెక్నీకల్ యూనిట్ అంతా కూడా సాలిడ్ వర్క్ ని అందించారు అని చెప్పాలి. మెయిన్ గా సినిమాలో పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కొన్ని ర్యాప్ బిట్స్ అయితే ఇంప్రెసివ్ గా ఉన్నాయని చెప్పాలి. అలాగే సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది. డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా చాలా వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా కట్ చేశారు.

ఇక దర్శకుడు యదు వంశీ విషయానికి వస్తే.. తాను ఈ సినిమాకి మంచి వర్క్ అందించాడు అని చెప్పాలి. రొటీన్ కథనే దాదాపు అందరి జీవితాల్లో చూసే కథనే తాను బిగ్ స్క్రీన్ పై ఆవిష్కరించిన విధానం బాగుంది. ముఖ్యంగా ఒక బ్యాచ్ ఫ్రెండ్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయిపోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలో తాను సినిమాని ఎంటర్టైనింగ్ జోన్ నుంచి సీరియస్ గా మార్చిన విధానం సినిమాలో చాలా బాగుంది. అక్కడ నుంచి కూడా మరీ ఎక్కువ పక్కదారి పట్టకుండా తాను జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇలా ఓవరాల్ గా ఈ చిత్రానికి తన వర్క్ బాగుంది.

 

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “కమిటీ కుర్రోళ్ళు” మాత్రం ప్రతి ఊర్లో కలిసి సరదాగా ఉండే ప్రతి స్నేహితున్ని తమలో వాళ్ళని చూపిస్తారు, నవ్విస్తారు, భావోద్వేగపరుస్తారు. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తారు. లీడ్ లో కనిపించిన ప్రతి యువ నటీనటులు సినిమాలో బాగా చేశారు. కొన్ని అంశాలు పక్కన పెడితే చాలా కాలం తర్వాత స్నేహితుల నేపథ్యంలో వచ్చిన మంచి సినిమాగా ఇది అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ఈ వారాంతానికి ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version