ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో కామన్ పాయింట్ ఇదే!

ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో కామన్ పాయింట్ ఇదే!

Published on Mar 28, 2025 3:21 PM IST

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ శుక్రవారం రెండు తెలుగు చిత్రాలు, రెండు డబ్బింగ్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలన్నింటిపై కూడా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలు వేర్వేరు జోనర్లకు చెందినవి కాగా, వాటిని బడ్జెట్ కూడా వేరు. అయితే, ఈ నాలుగు సినిమాల్లోనూ ఓ కామన్ పాయింట్ ఉండటం విశేషం.

తెలుగులో రాబిన్‌హుడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర నవ్వులు పూయిస్తున్నాయి. ఇక మలయాళ హీరో మోహన్ లాల్ లీడ్ రోల్‌లో నటించిన ఎంపురాన్(లూసిఫర్-2), విక్రమ్ నటించిన వీర ధీర శూర చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు పోటీ పడుతున్నాయి. అయితే, ఈ నాలుగు చిత్రాలు కూడా తమ నెక్స్ట్ పార్ట్‌ను అనౌన్స్ చేయడం విశేషం. లూసిఫిర్-2 చిత్రానికి L3 – ది బిగెనింగ్, వీర ధీర శూర పార్ట్ 2కి ప్రీక్వెల్‌గా పార్ట్ 1, మ్యాడ్ స్క్వేర్‌కు సీక్వెల్ మ్యాడ్ క్యూబ్, రాబిన్‌హుడ్ సీక్వెల్ బ్రదర్‌హుడ్ ఆఫ్ రాబిన్‌హుడ్ చిత్రాలు రాబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఇలా బాక్సాఫీస్ దగ్గర ఒకేసారి సందడి చేస్తున్న నాలుగు చిత్రాలకు కూడా కంటిన్యూ మూవీ ఉండటం విశేషం. ఇక ఈ సినిమాలకు ప్రేక్షకులను నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు