కన్ఫర్మ్ : “పుష్ప 2” లో బన్నీ చేత మరో క్రేజీ సీక్వెన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఇండియా లోనే ఏ సినిమాకి జరగని భారీ స్థాయి బిజినెస్ ఈ చిత్రానికి జరుగుతూ ఉండగా ఈ సినిమా కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ చిత్రంలో ఉన్న అనేక హైలైట్ సీక్వెన్స్ లలో ఇపుడు వరకు జాతర సీక్వెన్స్ కోసం అంతా మాట్లాడుకున్నారు. దీనిని లేటెస్ట్ టీజర్ లో కూడా మేకర్స్ చూపించారు. మరి ఇందులో బన్నీ తన నట విశ్వరూపం చూపించగా నెక్స్ట్ మరో క్రేజీ సీక్వెన్స్ ఇపుడు కన్ఫర్మ్ అయింది. ప్రస్తుతం ఒక అండర్ వాటర్ సీక్వెన్స్(నీటి లోపల) ని తెరకెక్కిస్తున్నట్టుగా సినిమా ఛాయాగ్రాహకులు కూబా కన్ఫర్మ్ చేశారు.

గతంలో పుష్ప 1 కి ఓ బోట్ సీక్వెన్స్ నీటిలో ఉంటుంది అని టాక్ వచ్చింది. కానీ అది సినిమాలో లేదు కానీ ఈసారి కూబా అయితే సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సీన్ సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది ఆగస్ట్ 15 న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది.

Exit mobile version