కన్ఫర్మ్: “పుష్ప 2” సస్పెన్స్ పై క్లారిటీ..

కన్ఫర్మ్: “పుష్ప 2” సస్పెన్స్ పై క్లారిటీ..

Published on Jun 16, 2024 3:22 PM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రష్మికా మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా మన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి ఇప్పుడు వరకు వచ్చిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ పాన్ ఇండియా లెవెల్లో మంచి రీచ్ ని అందుకున్నాయి.

అయితే మేకర్స్ ఎప్పుడో ఈ సినిమా రిలీజ్ ఈ ఆగష్టు 15కి అని ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ గత కొన్ని రోజులు నుంచి మాత్రం పుష్ప 2 ఈ డేట్ లో రాకపోవచ్చు అనే మాటే ఎక్కువగా బయటకి వచ్చింది. పైగా ఇదే డేట్ లో మరిన్ని సినిమాలు లాక్ కావడంతో పుష్ప 2 వాయిదా ఖరారే అని అంతా అనుకున్నారు..

దీనితో ఫాన్స్ లో ఒకింత సస్పెన్స్ నెలకొంది. సినిమా ఉందా లేదా అనే ప్రశ్నకి ఇప్పుడు లేటెస్ట్ పోస్ట్ తో అయితే తెర దించేశారు. ఈ సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు అన్నట్టుగా సూసేకి సాంగ్ రెస్పాన్స్ పోస్ట్ తో పుష్ప 2 ఆగష్టు 15 గ్రాండ్ రిలీజ్ అని రీ కన్ఫర్మ్ చేశారు. సో ఇందులో ఎలాంటి మార్పు లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు