కన్ఫర్మ్..”కేజీయఫ్ 2″ ఓటిటి స్ట్రీమింగ్ వారితోనే.!


కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో అంచనాలు నడుమ నిన్న విడుదల అయ్యింది. అయితే ఫస్ట్ షో నుంచే మంచి మౌత్ టాక్ ని అందుకున్న ఈ సినిమా ఓటిటి రిలీజ్ మరియు స్ట్రీమింగ్ పార్ట్నర్ పై ఒక ఫైనల్ క్లారిటీ ఇప్పుడు వచ్చేసింది.

గతంలో చాప్టర్ 1 హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమేజాన్ ప్రైమ్ వీడియో వారికే ఈసారి చాప్టర్ 2 తాలూకా అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కలు కూడా ఇచ్చినట్టు కన్ఫర్మ్ అయ్యింది. అప్పట్లో పార్ట్ కే ప్రైమ్ వీడియో వారు భారీ హైప్ తెచ్చుకున్నారు. ఇక రెండో సినిమా స్ట్రీమింగ్ నాటికి ఎలాంటి క్రేజ్ తో రెస్పాన్స్ తెచ్చుకుంటారో అనేది చూడాలి. ప్రస్తుతం అయితే ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకెళ్తుంది.

Exit mobile version