ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా హిట్ చిత్రం పుష్ప 2 కోసం అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమా దగ్గర ఆల్ టైం బిగ్గెస్ట్ గ్రాసర్(చైనా రిలీజ్ కాకుండా) గా పుష్ప 2 రికార్డులు తిరగరాసింది. ఇక ఈ సినిమాకి కూడా మేకర్స్ మరో సీక్వెల్ పుష్ప 3 ది ర్యాంపేజ్ ని కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
మరి ఈ సినిమాపై లేటెస్ట్ గా నిర్మాత రవి శంకర్ రివీల్ చేసిన అప్డేట్ వైరల్ గా మారింది. ఈ చిత్రాన్ని తాము 2028లో రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అంటే ఇంకో మూడేళ్ళలోనే ఈ సినిమా స్టార్ట్ అయ్యి 2028కే రావచ్చని చెప్పవచ్చు. మరి పుష్ప 3 ఏ రేంజ్ లో సంచలనం రేపుతుందో చూడాలి మరి. ప్రస్తుతం అయితే మైత్రి మూవీ మేకర్స్ నుంచి నితిన్, శ్రీలీల హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం రాబిన్ హుడ్ రిలీజ్ కి రాబోతుంది.