పవన్ ప్లానింగ్ కి కరోనా ఎఫెక్ట్ !

Published on Aug 3, 2020 8:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూనే వకీల్ సాబ్, అలాగే క్రిష్ దర్శకత్వంలో మరో పిరియాడిక్ మూవీ చేస్తున్నాడు. కరోనా రాకపోయి ఉంటే ఈ పాటికి హరీష శంకర్ దర్శకత్వంలోనూ ఒక సినిమా మొదలయ్యేది. కానీ కరోనా రాకతో వకీల్ సాబ్ సినిమా ఆగిపోవడం, పైగా ఇంకా షూట్ ఉండటం, దీనికి తోడు క్రిష్ సినిమాకి ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి రావడంతో మొత్తానికి పవన్ తరువాత చేయాలనుకున్న సినిమాల పై బాగానే ఎఫెక్ట్ పడేలా ఉంది. పైగా కరోనా ఈ ఏడాది మొత్తం ఉండేలా కనబడటంతో ఇక పవన్ సినిమాల ప్లానింగ్ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చే ఏడాదికి పూర్తవుతాయి. అయితే పవన్ 2022లో సినిమాలు చేసే ఆలోచనలో లేడని తెలుస్తోంది. ఆ మధ్య డాలీ దరకత్వంలో సినిమా చేయడానికి పవన్ నుండి సానుకూల స్పందన వచ్చిందట. కానీ ఇప్పుడు పవన్ ఆ సినిమా కూడా చేయకపోవచ్చు. పవన్ ఇక కొత్త సినిమాల విషయంలో సానుకూలంగా స్పందించే అవకాశం లేదట.

సంబంధిత సమాచారం :

More