పవన్ కి అన్న, వదినలు ఇచ్చిన పెన్ను ఖరీదు పెద్ద మొత్తమే..

పవన్ కి అన్న, వదినలు ఇచ్చిన పెన్ను ఖరీదు పెద్ద మొత్తమే..

Published on Jun 16, 2024 8:05 AM IST


టాలీవుడ్ ప్రముఖ హీరో ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదా సొంతం చేసుకున్న రియల్ ‘పవర్’ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అభిమానులు తన “తమ్ముడు” రీ రిలీజ్ తో రచ్చ చేస్తున్నారు. ఇక ఈ కొన్ని రోజులు కితమే పవన్ తన భాద్యతలు చేపడుతూ సంతకం చేసిన విజువల్స్ వైరల్ అయ్యాయి.

అయితే ఇందులో పవన్ చాలా సింపుల్ పెన్ తో సంతకం చేసాడు. ఇది వెంటనే వైరల్ అయ్యింది. కానీ తర్వాత అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేసిన వీడియోలో తన సతీమణి పవన్ వదిన సురేఖ గారు పవన్ కి ఒక ప్రత్యేకమైన పెన్ ని బహుకరించారు. అయితే ఇది చూసేందుకు డిఫరెంట్ గా ఉండగా అభిమానులు ఎప్పటిలానే దీన్నీ డీకోడ్ చేయడం స్టార్ట్ చేశారు.

దీనితో ఈ పెన్ను ఖరీదు బయటకి వచ్చింది. మరి ఇది డిస్నీ వెర్షన్ పెన్ కాగా ఇది ఏకంగా రెండున్నర లక్షల పైమాటే ఉంది. కరెక్ట్ గా అయితే 2 లక్షల 53 వేల 975 చిల్లర ఉంది. అంటే ఇది కొనాలంటే పెద్ద మొత్తమే ఉండాలని చెప్పాలి.. దీనితో ఈ పెన్ను ఖరీదు వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు