లేటెస్ట్ గా మన టాలీవుడ్ సినిమా నుంచి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో యువ హీరో ప్రియదర్శి అలాగే హర్ష రోషన్ లతో దర్శకుడు రామ్ జగదీశ్ తెరకెక్కించిన చిత్రం “కోర్ట్” కూడా ఒకటి. ఇంట్రెస్టింగ్ అంశంతో అంతకు మించి థ్రిల్లింగ్ కథనంతో వచ్చిన ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లోనే 24 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకుంది. అయితే ఈ మూడు రోజులు తర్వాత మొదటి వర్కింగ్ డే సోమవారం కీలక టెస్ట్ కాగా దీనిని కోర్ట్ చిత్రం సునాయాసంగా పాస్ అయ్యింది అని చెప్పాలి.
ఒక్క సోమవారం నాడే ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా నాలుగున్న కోట్లు గ్రాస్ నమోదు అయ్యినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ చిత్రం ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇలా మొత్తం నాలుగు రోజుల్లో ఈ చిత్రం 29 కోట్ల దగ్గర గ్రాస్ ని కొల్లగొట్టింది. ఇక యూఎస్ మార్కెట్ లో కూడా 7 లక్షలకి పైగా డాలర్స్ గ్రాస్ ని ఈ చిత్రం సొంతం చేసుకోగా అక్కడ 1 మిలియన్ దిశగా దూసుకెళ్తుంది. ఇక ఈ చిత్రానికి నాచురల్ స్టార్ నాని నిర్మాణం వహించగా బేబి సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.