న్యాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ‘కోర్ట్’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు రామ్ జగదీష్ డైరెక్ట్ చేయగా ఇంటెన్స్ కోర్టు రూమ్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ ముఖ్య పాత్రల్లో నటించారు.
ఈ సినిమాకు వసూళ్లు కూడా సాలిడ్‌గా రావడంతో ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా లేటెస్ట్ వసూళ్ల వివరాలు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా ఇప్పటివరకు రూ.56.50 కోట్ల మేర కలెక్షన్స్ సాధించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా ఈ సినిమాను నిలిపినందుకు చిత్ర యూనిట్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.
ఈ సినిమాకు విజయ్ బుల్గనిన్ సంగీతం అందించగా ప్రశాంతి తిపిర్నేని ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా టోటల్ రన్‌లో ఎంతమేర వసూళ్లు రాబడుతుందో చూడాలి.