ఓటిటిలో ‘ఛావా’ని మించి ‘కోర్ట్’ సెన్సేషన్!

ఓటిటిలో ‘ఛావా’ని మించి ‘కోర్ట్’ సెన్సేషన్!

Published on Apr 16, 2025 11:55 AM IST

ఇటీవల తెలుగు సినిమా సహా హిందీ సినిమా దగ్గర సూపర్ హిట్ అయ్యిన చిత్రాల్లో బాలీవుడ్ నటుడు విక్కీ కౌషల్ అలాగే రష్మిక మందన్నా కాంబినేషన్ లో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన చిత్రం ‘ఛావా’ అలాగే మన తెలుగు నుంచి యంగ్ హీరో ప్రియదర్శి హీరోగా నాచురల్ స్టార్ నాని నిర్మాణంలో వచ్చిన ‘కోర్ట్’ చిత్రాలు ఎంతగానో అలరించాయి.

అయితే ఈ రెండు చిత్రాలు కూడా రీసెంట్ గానే దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కి వచ్చాయి. ఒకే రోజు వచ్చిన ఈ రెండు సినిమాలు ఒకేలాంటి రెస్పాన్స్ ని అందుకోవడం అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది అని చెప్పాలి. ఛావా సినిమా హిందీ సహా తెలుగులో వచ్చింది. కోర్ట్ పాన్ ఇండియా భాషల్లో వచ్చింది. మరి రెండు సినిమాలు కూడా మొదటి వారానికి 2.2 మిలియన్ వ్యూస్ ని అందుకున్నాయి.

ఇక వ్యూ హావర్స్ లో మాత్రం ఛావా చిత్రానికి 59 లక్షల గంటలు వస్తే కోర్ట్ కి కేవలం 5 లక్షల గంటలు మాత్రమే గ్యాప్ తో 55 లక్షల గంటలు వ్యూ హావర్స్ లాక్ అయ్యాయి. మరి కోర్ట్ తో పోలిస్తే ఛావా రీచ్ హిందీలో ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయినప్పటికీ వ్యూస్ లో సమానంగా వాచ్ హావర్స్ లో స్వల్ప గ్యాప్ తో కోర్ట్ చిత్రం ఓటిటిలో సెన్సేషన్ సెట్ చేసింది అని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు