లేటెస్ట్ గా మన తెలుగు సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చి సూపర్ హిట్ అయ్యిన లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ నటులు ప్రియదర్శి, హర్ష రోహన్ అలానే శ్రీదేవి కలయికలో దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన చిత్రం “కోర్ట్” కూడా ఒకటి. ఇంట్రెస్టింగ్ కోర్ట్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం సాలిడ్ ఓపెనింగ్స్ అందుకొని నానికి మంచి లాభాలు అందించింది.
ఇలా మొత్తం 8 రోజుల రన్ ని ఈ సినిమా కంప్లీట్ చేసుకోగా ఈ 8 రోజుల్లో కూడా ఈ చిత్రం వీక్ డేస్ లోనూ సాలిడ్ నంబర్స్ అందుకోవడం అనేది విశేషం. ఇలా పి ఆర్ నంబర్స్ ప్రకారం డే 8 ఈ చిత్రం 2.7 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో మొత్తం ఈ 8 రోజుల్లో కోర్ట్ చిత్రం 42.3 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే యూఎస్ లో కూడా 9 లక్షల డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసిన ఈ చిత్రం నెక్స్ట్ 1 మిలియన్ చేరుకోనుంది. ఇక ఈ వీకెండ్ తో అయితే ఈ వసూళ్లు 50 కోట్ల మార్క్ ని అందుకున్నా ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు.