‘కోర్ట్’ సక్సెస్ మా ‘టుక్ టుక్’పై ఎఫెక్ట్ చూపిస్తుంది – ప్రీరిలీజ్ లో దర్శకుడు

‘కోర్ట్’ సక్సెస్ మా ‘టుక్ టుక్’పై ఎఫెక్ట్ చూపిస్తుంది – ప్రీరిలీజ్ లో దర్శకుడు

Published on Mar 18, 2025 8:30 AM IST

ఇపుడు మన టాలీవుడ్ లో ఫాంటసీ, మ్యాజికల్‌ అంశాలతో ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ఫ్రెష్ కంటెంట్‌తో రాబోతున్న లేటెస్ట్ చిత్రమే ‘టుక్‌ టుక్‌’. కోర్ట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ నటుడు హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు,సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి సి.సుప్రీత్‌ కృష్ణ దర్శకుడు. చిత్రవాహిని మరియు ఆర్ వై జి సినిమాస్‌ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డిలు ఈచిత్రాన్ని నిర్మించారు.

మార్చి 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో నిహాల్‌ కోదాటి మాట్లాడుతూ.. ”దర్శకుడు సుప్రీత్‌కు ఈ సినిమా చాలా ప్రత్యేకం. ఈ సినిమా తప్పకుండా ఆడియన్స్‌కు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఓ మంచి సినిమా చేశామనే సంతృప్తి ఉంది. సినిమా చూస్తున్నంత సేపు అందరూ ఎంతో ఎంజాయ్‌ చేస్తారు. ముఖ్యంగా వినోదం అందరికి నచ్చుతుంది. సాంకేతికంగా కూడా చాలా అత్యున్నతంగా ఉన్న సినిమా ఇది. అందరూ థియేటర్‌లో సినిమా చూడాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమాకు అందరి సపోర్ట్‌ రావాలి. ఇలాంటి సినిమాలు విజయం సాధిస్తే ఇలాంటి కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు చాలా వస్తాయి” అన్నారు.

అలాగే శాన్వీ మేఘన మాట్లాడుతూ..”రీసెంట్‌గా కుడుంబస్తాన్‌ అనే తమిళ సినిమా చేశాను. ఆ సినిమాకు చాలా మంచి స్పందన వస్తోంది. అందరూ మంచి ప్రేమ ఇచ్చారు. ఓటీటీలో కూడా తెలుగులో ఆ సినిమా విడుదలైంది. తెలుగు వాళ్లకు కూడా ఆ సినిమా నచ్చింది. కుడుంబస్తాన్‌ను ఆదరించినట్లే తెలుగు ప్రేక్షకులు మా టుక్‌టుక్‌ను ఆదిరించి, ఈ తెలుగమ్మాయికి ఆశ్వీరదిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాను దర్శకుడు ఎంత అందంగా నేరేట్‌ చేశాడో, సినిమాను కూడా అంతే అందంగా తెరకెక్కించాడు. ఈ ఫాంటసీ సినిమాను అందరూ ఫ్యామిలీతో థియేటర్‌లో చూసి ఎంజాయ్‌ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మా టీమ్‌ అందరికి మంచి విజయం అందిస్తుందనే హోప్‌ ఉంది” అన్నారు.

ఇక దర్శకుడు సుప్రీత్‌ సి. కృష్ణ మాట్లాడుతూ.. ”టీజర్‌కు, ట్రైలర్‌కు, ఏఐ పాటకు వస్తున్న స్పందన చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. మార్చి 21న అందరూ ఓ కొత్త తెలుగు సినిమా చూడబోతున్నారు. ఓ కమర్షియల్‌ ప్యాకేజీలో ఇలాంటి సినిమా చేయడం గొప్పగా అనిపించింది. టుక్‌ టుక్ ఐడియా రాగానే అందరికి ఈ కాన్సెప్ట్‌ను ఫ్రాంఛైజీగా, యూనివర్శ్‌గా బిల్డ్‌ చేయాలని ఉంది. ఒక వెహికల్‌లో ఓ సోల్‌, ఆ వెహికల్‌కు ఓ బ్యాక్‌స్టోరీ ఈ కాన్సెప్ట్‌ను రకరకాలుగా చేయాలని ఉంది. తప్పకుండా ఈ చిత్రం అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. రోషన్‌ నటించిన కోర్టు మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో కూడా రోషన్‌ ఓ మంచి పాత్రను చేశాడు. తప్పకుండా కోర్టు సక్సెస్‌ మా సినిమాపై కూడా రిఫ్లెక్ట్‌ అవుతుంది” అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన రాహుల్‌ రెడ్డి మాట్లాడుతూ..”ఫాంటసీ థ్రిల్లింగ్‌ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. మార్చి 21న చిత్రాన్ని అందరూ థియేటర్‌లో చూసి ఎంజాయ్‌ చేయాలని కోరుకుంటున్నాం” అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు