కరోనా ప్రభావం – భారీ సంఖ్యలో థియేటర్స్ మూత పడడం తప్పదా?

Published on Sep 24, 2020 10:00 pm IST

కరోనా వల్ల నెలకొన్న పరిస్థితుల మూలాన ఎన్నో తీవ్ర నష్టాలు వాటిల్లాయి. ఒక్క వైరస్ సోకుతుందన్న కారణంతోనే కాకుండా తప్పని సరి పరిస్థితుల్లో విధించుకున్న లాక్ డౌన్ వల్ల కూడా ఎన్నో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చి ఎంతో నష్టం జరిగింది. ముఖ్యంగా అయితే సినీ పరిశ్రమకే ఒక రకంగా ఎక్కువ నష్ట వాటిల్లిందని చెప్పాలి. సినిమా రంగానికి చెందిన అత్యంత కీలక విభాగం థియేటర్ వ్యవస్థ.

ఈ వ్యవస్థే ఇపుడు అతలాకుతలంగా మారి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో అర్ధం కానీ పరిస్థితుల్లోకి నెట్టివేయ బడింది. దాదాపు ఏడు నెలల నుంచీ మన దేశంలో థియేటర్స్ అంతా మూతపడి ఉన్నాయి. దీనితో వాటినే నమ్ముకొని ఉన్న ఎందరో జీవితాలు ఛిద్రం అయ్యిపోయాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ నుంచి భారీ మల్టీ ప్లెక్సుల వరకూ కూడా ప్రతీ ఒక్కరికీ ఈ కరోనా మూలాన భారీ స్థాయి నష్టం వచ్చింది.

కేవలం వీటి మీదనే ఆధాపడి ఉన్న వారికి కేవలం తెరపై సినిమా పడితేనే బతుకు బండి సాగేది సినిమా చిన్నదో పెద్దదో ఇపుడు ఎటు కాకుండా డబ్బులే లేకుండా పోయాయే..ఇక మల్టీ ప్లెక్సులను నిర్మించిన వారికి అయితే మొదటి మూడు నెలలు ఉన్న దాంట్లో స్టాఫ్ కు హాఫ్ సాలరీస్ ఇచ్చి బతుకు బండిని లాగారు. కానీ తర్వాత స్టాఫ్ కు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొనడంతో ఆ స్టాఫ్ జీవితాలు రోడ్డున పడ్డాయి.

అలాంటి దారుణ ఘటనే మన హైదరాబద్ కు చెందిన ప్రసాద్స్ మల్టీ ప్లెక్స్ లో చోటు చేసుకుంది. అయితే ఇపుడు సడలింపులతో థియేటర్స్ తెరిచినా చాలా వరకు థియేటర్స్ మూత పడిపోవడం ఖాయం అని చెప్పక తప్పడం లేదు. అందుకు థియరీ కూడా ఉంది. సడలింపులతో తెరిచినా మళ్ళీ థియేటర్ రన్ చేసి అన్ని ఖర్చులు పోగా వచ్చిన దానితో బ్రతకాలి.

కానీ ఈ ప్రమాదకర పరిస్థితుల్లో అంత మంది జనంతో మూసి ఉన్న థియేటర్ లో కూర్చివాలి అంటే ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఇక ఇది చాలదు అన్నట్టు చాలా మంది నిర్మాతలు కూడా వారు తీసిన దానికి తగ్గ అమౌంట్ పలు ఓటిటి సంస్థలు ఇస్తే వారికి సినిమాలు ఇచ్చేయడం ఇప్పటికే మొదలయ్యిపోయింది. ఇది మరింత దెబ్బ అని చెప్పాలి.

ఎక్కడా లేని విధంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అత్యధికంగా మన దేశంలోనే ఉన్నాయి. ఈ ఓటిటి రిలీజ్ వల్ల వాటిపై మరింత ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ లెక్కన ఇవన్నీ భేరీజు వేసుకుంటే మన దేశంలో రాబోయే కొన్నాళ్లలో 20 శాతం థియేటర్స్ శాశ్వతంగా మూత పడిపోతాయని ఒక అంచనా. కేవలం పెద్ద హీరోల సినిమాలు అలాగే భారీ బడ్జెట్ తో కూడిన సినిమాలు వల్ల ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళు తీసుకునే నిర్ణయం వలన తప్ప ఎగ్జిబిటర్లు గట్టెక్కరు.

సంబంధిత సమాచారం :

More