‘పుష్ప 2’ పై మరో నేత సంచలన కామెంట్స్ !

‘పుష్ప 2’ పై మరో నేత సంచలన కామెంట్స్ !

Published on Dec 22, 2024 12:30 PM IST

‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ కోసం వచ్చి, సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో దురదృష్టవశాత్తూ రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆమె కుమారుడు ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడం, బన్నీ వివరణ ఇవ్వడం తెలిసిందే. అయితే, ఈ వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. తాజాగా సీపీఐ నేత నారాయణ స్పందించారు. ‘తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం పట్ల తాను ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు.

అనంతరం నారాయణ ‘పుష్ప 2′ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘పుష్ప సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్‌ చేసుకోవాలని మెసేజ్ ఇస్తోందా ?, పైగా సినిమాలో అసభ్యకరమైన పాటలు ఉన్నాయి. ఇలాంటి సినిమాకి ప్రభుత్వం సిగ్గులేకుండా టికెట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సమాజానికి ఉపయోగపడని సినిమాని ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించాలి. పైగా సినిమా ప్రీమియర్ కోసం వచ్చి ఓ మహిళ చనిపోయింది. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్‌లో ఇలా జరగకుండా చూడాలి’ అంటూ నారాయణ చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు