పూరీ పై మహేష్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ !

పూరీ పై మహేష్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ !

Published on May 31, 2020 6:00 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు – డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ అంటేనే అభిమానులకు ఫుల్ క్రేజ్. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘పోకిరి’ అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. ఈ సినిమానే ‘ప్రిన్స్’ మహేష్ బాబును ‘సూపర్ స్టార్’ మహేష్ బాబుగా మార్చింది. ఆ తర్వాత వీరిద్దిరి కాంబినేషన్‌లో వచ్చిన ‘బిజినెస్ మ్యాన్’ కూడ మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో సూర్య భాయిగా మహేష్‌లోని విలన్ షేడ్స్ బయటపెట్టాడు పూరీ జగన్నాథ్.

అయితే ఆ తర్వాత వీరి కలయికలో మూడో సినిమాగా ‘జనగణమన’ అనే సినిమాను అనౌన్స్ చేసినా అది పట్టాలెక్కలేదు. అయితే పూరితో సినిమా పై తాజాగా మహేష్ స్పందించాడు. ఫ్యాన్స్ తో ఇన్ స్టాగ్రామ్ వేదికగా మహేష్ జరిపిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ లో ఓ అభిమాని ‘సర్ భవిష్యత్తులో మీరు పూరితో సినిమా చేస్తారా ? మేము వెయిటింగ్ సర్ ?’ అని అడగగా.. దానికి మహేష్ సమాధానమిస్తూ.. ‘తప్పకుండా చేస్తాను. నా ఫేవరేట్ డైరెక్టర్స్ లో పూరీ జగన్నాథ్ ఒకరు. అతని స్క్రిప్ట్ అండ్ నరేషన్ కోసం నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను’ అని మహేష్ తెలిపారు. మరి గతంలో ఆగిపోయిన జనగణమన సినిమానే కొంచెం మార్పులు చేర్పులు చేసి మహేష్ బాబును పూరి ఒప్పిస్తాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు