చరణ్ తో క్రేజీ యాక్షన్ డ్రామా.. నిజమేనా ?

Published on Oct 25, 2020 1:45 am IST

‘మహర్షి’తో డైరెక్టర్ వంశీ పైడిపల్లికి సూపర్ హిట్ రావడంతో ఆయన తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. మొదట వంశీ తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టేసారు. ఈ లోపు పరుశురామ్ తో సర్కారు వారి పాట అంటూ మహేష్ సినిమా మొదలెట్టేసాడు. దాంతో వంశీ మిగిలిన స్టార్ హీరోల చుట్టూ కథ పట్టుకుని తిరుగుతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వంశీ తన తరువాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్లాన్ చేస్తున్నాడని.. చరణ్ కూడా వంశీతో సినిమాకి ఒప్పుకున్నాడని రూమర్స్ వినిపించాయి.

మరి ఈ రూమర్స్ లో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి, చరణ్ కి ఫుల్ స్క్రిప్ట్ వినిపించాడని.. చరణ్ కూడా కథ విని బాగుందని చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే మెగాస్టార్ కి కూడా కథ చెప్పాల్సి ఉంటుందట. ఈ సినిమా పూర్తిస్థాయి ఎమోషనల్ యాక్షన్ చిత్రంగా ఉండబోతోందని, ప్రత్యేకంగా చెప్పాలంటే.. కేజీఎఫ్ మూవీలా క్రేజీ యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ లో ఈ సినిమా సాగుతోందని.. ముఖ్యంగా చరణ్ కి ఇది మరో పాన్ ఇండియా మూవీలా వంశీ పైడిపల్లి ఈ సినిమాని రూపొందించే ప్లాన్ లో ఉన్నాడని సమాచారం. ఒకవేళ వంశీ నిజంగానే చరణ్ తో సినిమా చేస్తే.. ఆ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి.

సంబంధిత సమాచారం :

More