కన్నడ హీరో రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ నటించిన ‘కాంతార’ చిత్రం బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. పూర్తి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా కన్నడతో పాటు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఈ చిత్రానికి ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు రిషబ్ శెట్టి.
ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరగుతున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో తాజాగా ఓ వార్త సినీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుందని.. మరో 20 రోజుల్లో ఈ చిత్ర షూటింగ్ ముగుస్తుందని తెలుస్తోంది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసి ఈ చిత్రాన్ని వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
కాగా, ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ జరగనుందని తెలుస్తోంది. కాంతార చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్ ఈ ప్రీక్వెల్ చిత్రానికి కూడా వర్క్ చేస్తున్నారు.