‘కుబేర’ అప్డేట్‌పై క్రేజీ రూమర్!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘కుబేర’పై ప్రేక్షకుల్లో ముందునుంచి మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ నటిస్తోంది. అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న లాంటి వెర్సటైల్ యాక్టర్స్ ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ చిత్రం ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ రాబోతుందనే వార్త నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతోంది. ‘కుబేర’ సినిమా నుండి తొలి లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారట. ఈ సాంగ్‌ని అక్టోబర్ రెండో వారం లేదా మూడో వారంలో రిలీజ్ చేస్తారనే వార్త నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతోంది.

దీంతో ఒక్కసారిగా ‘కుబేర’ మూవీ ట్రెండ్ అవుతోంది. మరి నిజంగానే ‘కుబేర’ మూవీ నుండి సాంగ్ రిలీజ్ అవుతుందా లేదా అనే విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version