SSMB29 Glimpse: రాజమౌళి ‘సూపర్’ ప్లాన్?

SSMB29 Glimpse: రాజమౌళి ‘సూపర్’ ప్లాన్?

Published on Apr 15, 2025 1:06 PM IST

గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కలయికలో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమాగా చేస్తుండగా అంచనాలు ఈ సినిమా పట్ల ఆకాశంలో ఉన్నాయి. అయితే ఈ సినిమా జక్కన్న నుంచి గత సినిమాల్లా కాకుండా చాలా సైలెంట్ గా భారీ సెట్టింగ్స్ నడుమ చకచకా షూటింగ్ జరిగిపోతుంది.

అయితే ఈ చిత్రం నుంచి ఒక సాలిడ్ ట్రీట్ లాంటిది కావాలని ఎప్పుడు నుంచో మహేష్ అభిమానులు కోరుకుంటున్నారు. సినిమా అనౌన్సమెంట్ పై కూడా ఎలాంటి అధికారిక అప్డేట్ ఇవ్వకపోవడంతో చాలా అప్డేట్స్ పెండింగ్ లో పడ్డాయి. అయితే ఓ క్రేజీ బజ్ ఇపుడు ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై వినిపిస్తుంది.

మేకర్స్ ఓ స్టన్నింగ్ గ్లింప్స్ లాంటిది ఒకదాన్ని రాజమౌళి గ్రాండ్ విజన్ తో ప్లాన్ చేస్తున్నట్టుగా ఇపుడు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం మేకర్స్ ఈ పనిలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఇది పూర్తయ్యాక అనౌన్సమెంట్ ఎప్పుడు ఏంటి అనేది ఓ క్లారిటీ రానున్నట్టుగా ఇపుడు టాక్. మరి దీనిపై మరిన్ని డీటెయిల్స్ ఇంకా బయటకి రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు