బాక్సాఫీస్ బద్దలయ్యే కాంబినేషన్.. చరణ్, నీల్ సినిమా ఈ ఏడాదిలో?

బాక్సాఫీస్ బద్దలయ్యే కాంబినేషన్.. చరణ్, నీల్ సినిమా ఈ ఏడాదిలో?

Published on Oct 8, 2024 9:03 PM IST

ప్రస్తుతం మన ఇండియన్ సినిమా దగ్గర ఎలాంటి క్రేజీ కాంబినేషన్స్ సెట్టవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. మరి ఈ సినిమాల జాబితాలో ఒకో స్టార్ హీరో ఒకో స్టార్ దర్శకునితో అనౌన్స్ చేసే సినిమాలు అభిమానులకి మూవీ లవర్స్ కి కూడా క్రేజీ హైప్ ని తీసుకొస్తున్నాయి. అలా ఇప్పుడు ఆల్రెడీ సెట్స్ మీద కొని క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అయితే అలా ఎదురు చూస్తున్న కొన్ని ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కూడా ఒకటి.

మరి ఈ కాంబినేషన్ లో సినిమా కోసం ఎపుడు నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు కానీ ఇది ఇంకా సెట్ కాలేదు. అయితే చర్చలు మాత్రం ప్రస్తుతానికి ఉన్నాయని తెలుస్తుంది. మరి లేటెస్ట్ రూమర్స్ ప్రకారం ఈ మాసివ్ కాంబినేషన్ లో బహుశా 2028 లేదా ఆ తర్వాత ఉండొచ్చని వినిపిస్తుంది. అప్పటికి ఇద్దరూ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయ్యి ఖాళీ అయ్యి సమయం దొరికితే ఆ ఏడాదిలో సినిమా అనౌన్స్ కావచ్చట. మరి బాక్సాఫీస్ బద్దలయ్యే బిగ్గెస్ట్ కాంబినేషన్ పై మరింత క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు