క్రేజీ బజ్ : ‘నా సామిరంగ’ టీజర్ లాంచ్ చేయనున్న సూపర్ స్టార్ మహేష్ ?

క్రేజీ బజ్ : ‘నా సామిరంగ’ టీజర్ లాంచ్ చేయనున్న సూపర్ స్టార్ మహేష్ ?

Published on Dec 15, 2023 3:01 AM IST


టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా యువ దర్శకుడు విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ నా సామిరంగ. ఈ మూవీలో రాజ్ తరుణ్, అల్లరి నరేష్ కీలక పాత్రలు చేస్తుండగా ఇటీవల మూవీ నుండి సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరపరిచిన ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే పిల్ల అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ లభించింది.

విషయం ఏమిటంటే, మరొక మూడు రోజుల్లో జరుగనున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలే కి చీఫ్ గెస్ట్ గా రానున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, అదే షో లో నా సామిరంగ టీజర్ ని రిలీజ్ చేయనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ బజ్. ఈ విషయమై ఇప్పటికే టీమ్ ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్తున్నారు. అయితే దీని పై మేకర్స్ నుండి క్లారిటీ మాత్రం రావాల్సి ఉంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై ఈ మూవీని శ్రీనివాస చిట్టూరి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు