మన టాలీవుడ్ లో మాసు.. క్లాసు.. గ్రేసు.. ఇలా అన్ని కలిపి ఒక్కటైన స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవే అని చెప్పాలి. మరి తెలుగు సినిమా దగ్గరే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా తన డాన్సులతో ఆడియెన్స్ ని ఉర్రూతలు ఊగించారు. ఇలా ఒక సరికొత్త ట్రెండ్ ని మెగాస్టార్ చిరంజీవి సెట్ చేయగా తన డాన్సులతోనే థియేటర్స్ కి జనాన్ని రప్పించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.
అలా డాన్స్ అంటే చిరు, చిరు అంటే డాన్స్ కి ‘చిరు’నామా గా తాను మారి ఇప్పటికీ 7 పదుల వయసు దగ్గరలో కూడా అదే ఎనర్జీతో అలరిస్తున్నారు. మరి ఇపుడు ఇదే డాన్స్ విషయంలో చరిత్ర సృష్టించారు మెగాస్టార్. మరి లేటెస్ట్ గా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వారు మెగాస్టార్ చిరంజీవి 46 సంవత్సరాల కాలంలో తన 156 సినిమాల్లో 537 పాటల్లో 24000 డ్యాన్స్ మూవ్స్ చేశారు. ఇలా సినిమాల్లో ఎక్కువగా డాన్స్ వేసిన వన్ అండ్ ఓన్లీ హీరోగా మెగాస్టార్ చిరంజీవికి గిన్నీస్ వరల్డ్ రికార్డు వారు పురస్కారం అందించారు..
ఇది మాత్రం మెగా ఫ్యాన్స్ కి మంచి కిక్కిచ్చే న్యూస్ అనే చెప్పాలి. అసలు డాన్స్ అనేదే మెగా అభిమానులకి నరనరాల్లోకి ఎక్కించేలా చేసింది మెగాస్టార్ చిరంజీవే అలాంటిది ఇదే డాన్స్ విషయంలో గిన్నీస్ రికార్డు కొట్టడం అనేది వారికి దీనికి మించిన మరో ఆనందం ఉండదనే చెప్పాలి. అయితే ఈ అవార్డు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా మెగాస్టార్ కి అందించగా మెగా కుటుంబం నుంచి కొందరు అలాగే సినీ ప్రముఖ దర్శక నిర్మాతలు ఈ వేడుకలో హాజరయ్యారు..