యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ’, ‘విక్రమ్’ వంటి చిత్రాలు అద్భుత విజయాలు సాధించాయి. ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న ‘కూలీ’ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తానికి లోకేశ్ కనగరాజ్ కి యాక్షన్ డైరెక్టర్ గా సౌత్ లో ఫుల్ క్రేజ్ ఉంది. అయితే, ఆ మధ్య లోకేశ్ కనగరాజ్, ఎన్టీఆర్ కోసం ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడని కోలీవుడ్ మీడియాలో కథనాలు వినిపించాయి. కానీ అవేమీ నిజం కాలేదు. ఐతే, తాజాగా హీరో నానితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.
నిజానికి లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్‌సీయూ)కి ఫుల్ క్రేజ్ ఉంది. ‘‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’తో లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ మొదలైంది. పైగా కూలీ’ పూర్తి చేసిన తర్వాత, LCUలోని హీరోలందరితో పీక్ ఎల్‌సీయూ మూవీ చేయబోతున్నాను’ అని లోకేశ్ కనగరాజ్ ఇప్పటికే చెప్పుకొచ్చారు. మరి ఈ మూవీలో నానికి ఓ పాత్రను ఇస్తాడో, లేక.. ప్రత్యేకంగా నానితో ఓ సినిమా చేస్తాడో చూడాలి. ఏది ఏమైనా ఈ వార్త పై అధికారిక ప్రకటన వచ్చేవరకూ నమ్మలేం.