మహేష్ రెండు పాత్రలు అవే !

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9న రాజమౌళి – మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతోందని వార్తలు వస్తున్నాయి. ఆ రోజున ఈ మూవీ కాన్సెప్ట్ వీడియోని రిలీజ్ చేస్తారని టాక్. ఐతే, మహేష్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని.. అందులో ఒక క్యారెక్టర్ నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందని తెలుస్తోంది. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ రెండో క్యారెక్టర్ కీలకంగా ఉంటుందట. అలాగే, మరో క్యారెక్టర్ విషయానికి వస్తే.. మహేష్ వరల్డ్ ట్రావెలర్ గా కనిపిస్తాడట.

ఇక తాను జులై లేదా ఆగస్టులో మ్యూజిక్‌ వర్క్‌ స్టార్ట్‌ చేస్తా’ అని ఎం.ఎం. కీరవాణి చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల ఎంపిక విషయంలో రాజమౌళి టెస్ట్‌ షూట్స్‌ చేస్తున్నాడు. అన్నట్టు ఇప్పటికే ఈ సినిమా స్టోరీ లాక్‌ అయ్యింది. ప్రస్తుతం టీమ్ డైలాగ్స్ పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందట. మహేష్ కెరీర్ లోనే స్పెషల్ ఫిల్మ్ గా నిలిచిపోతుందట. కాగా తెలుగు నటీనటులనే కాకుండా, హిందీ, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు కూడా ఈ సినిమాలో నటించబోతున్నారు. అలాగే, ఈ మూవీలో ఓ హీరోయిన్‌గా చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ నటించనున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version