‘దేవర’ కోసం స్పెషల్ ఈవెంట్స్

‘దేవర’ కోసం స్పెషల్ ఈవెంట్స్

Published on Sep 2, 2024 11:00 AM IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, ప్రస్తుతం తారక్ బ్రేక్ తీసుకొని కర్ణాటకలో ఆలయాల దర్శనంలో బిజీగా ఉన్నాడు. తారక్ తిరిగి వచ్చాక, ఈ నెల రెండో వారం నుంచి దేవర ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నాడు. ముందుగా హిందీలో కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తున్నారు. అనంతరం అటు తమిళ ఇటు తెలుగులో ‘దేవర’ టీమ్ కొన్ని స్పెషల్ ఈవెంట్స్ ను, ఇంటర్వ్యూస్ ను ప్లాన్ చేస్తున్నారట.

ప్రస్తుతం ‘దేవర 1’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది టీమ్. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ లతో పాటు శ్రీకాంత్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు ‘దేవర పార్ట్ 1’ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి పాన్‌ ఇండియా రేంజ్‌ లో ఈ సినిమా ఏ రేంజ్ వసూళ్లు సాధిస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు