ప్రభాస్ ‘కల్కి’లో ఆమెది కీలక పాత్ర

ప్రభాస్ ‘కల్కి’లో ఆమెది కీలక పాత్ర

Published on Feb 19, 2024 3:00 PM IST

నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా – నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ‘కల్కి 2898 AD’ అనే ఫాంటసీ సైంటిఫిక్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రభాస్, దిశా పటానితో ఓ రొమాంటిక్ సాంగ్‌ ను షూట్ చేస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం దిశా పటాని పాత్ర కేవలం ఓ రొమాంటిక్ సాంగ్‌ కు మాత్రమే పరిమితం కావడం లేదట. సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తోందని.. ఈ క్రమంలోనే దిశా పటానితో ప్రభాస్ సాంగ్‌ వస్తోంది అని టాక్ నడుస్తోంది.

అయితే, ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో పుకార్లు వైరల్ అయ్యాయి. ఇందులో భాగంగా మరి పైవార్త నిజమో కాదో అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అన్నట్టు రీసెంట్ గా ఈ మూవీ క్లైమాక్స్‌ కు ముందు వచ్చే సన్నివేశాల్లో పరశురాముడిగా జూనియర్ ఎన్టీఆర్, కృపాచార్యుడి పాత్రలో నాని కనిపిస్తారని టాక్ నడిచింది. ఈ రూమర్ పై కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్‌ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మొత్తానికి పాన్ -ఇండియా చిత్రంగా ఈ సినిమాని మలచడానికి నాగ్ అశ్విన్ బాగా ప్రయత్నాలు చేస్తున్నాడు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు