పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో చేయనున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “స్పిరిట్” కూడా ఒకటి. అయితే డార్లింగ్ చేస్తున్న అన్ని సినిమాలు ఒకెత్తు అయితే ఈ స్పిరిట్ ఇంకొక ఎత్తు అని చెప్పాలి. ఈ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ కాస్టింగ్ తో ప్లాన్ చేస్తున్న టాక్ ఓ రేంజ్ లో హైప్ తీసుకొచ్చింది.
అయితే అలా వచ్చి ఓ రేంజ్ లో హల్చల్ చేసిన టాపిక్ లలో కొరియన్ బాలయ్య డాన్ లీ కూడా ఉన్నాడనే టాక్ కూడా మంచి ఆసక్తి రేపింది. అయితే అయితే ఈ రూమర్స్ ఇంకా నిజమే అన్నట్టుగా టాక్ సినీ వర్గాల్లో కొనసాగుతుంది.
డాన్ లీ అయితే ఈ సినిమాలో కనిపించడం ఖాయమే అన్నట్టుగా పాజిటివ్ బజ్ ఇపుడు ఉంది. అలాగే రానున్న ఈ రెండు మూడు నెలల్లో దీనిపై అధికారిక క్లారిటీ రానున్నట్లు ఇపుడు తెలుస్తోంది. మరి ఈ మెంటల్ మాస్ కలయిక ఎలా ఉంటుందో చూడాల్సిందే.