‘ఎన్టీఆర్ – నీల్’ సినిమా షూట్ ఎప్పుడంటే ?

‘దేవ‌ర‌’ హ‌డావుడి తగ్గడంతో ఎన్టీఆర్ ఇప్పుడు తన తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే, ‘వార్ 2’ షూటింగ్ స్టార్ట్ చేశాడు. ఐతే, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంచ్ చేశారు. పైగా సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో ‘ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్’ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఐతే, ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి ఓ న్యూస్ వినిపిస్తోంది. నవంబర్ లాస్ట్ వీక్ నుండి ఈ సినిమా షూట్ ని ప్రశాంత్ నీల్ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఐతే, ఎన్టీఆర్ మాత్రం జనవరి మూడో వారం తర్వాతే ఈ సినిమా సెట్స్ పైకి రానున్నాడట. అప్పటివరకూ ‘వార్ -2’ సినిమా షూట్ చేస్తాడట. మొత్తానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్’ సినిమా గురించి నిత్యం ఏదొక రూమర్ వినిపిస్తూనే ఉంది.

Exit mobile version