మణిరత్నం భారీ చిత్రం “పొన్నియన్ సెల్వన్” క్రేజీ ఓటిటి డీల్.!


మన ఇండియన్ సినిమా దగ్గర గొప్ప పేరున్న ఫిల్మ్ మేకర్స్ లో మణిరత్నం కూడా ఒకరు. తనదైన సినిమాలతో భారతదేశ సినీ పరిశ్రమ దగ్గర ఒక చెరగని ముఫరా వేసిన ఈ వెర్సిటైల్ దర్శకుడు ఇప్పుడు చేస్తున్న ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్”. ఆల్ మోస్ట్ తమిళ మరియు ఇండియన్ సినిమా దగ్గర ఉన్న ప్రధాన తారాగణంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ హంగులతో రెండు భాగాలుగా తెరకెక్కుతుంది.

మరి ఇదిలా ఉండగా ఇపుడు ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ హక్కులకు సంబంధించి టాక్ బయటకి వచ్చింది. దీని ప్రకారం అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ అమేజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నారట. మరి ఓటిటి వర్గాలు చెబుతున్న దాని ప్రకారం అయితే ఈ సినిమాకి 100 కోట్లకి పైగానే క్రేజీ ఆఫర్ ఇచ్చి కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఈ ఏడాది రిలీజ్ కానుండగా ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version