మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో నాచురల్ స్టార్ నాని అలాగే సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండలు కూడా ఒకరు. ఒకప్పుడు ఇద్దరు కలిసి ఓ సినిమాలో కూడా నటించారు. అయితే ఈ చిత్రం తర్వాత ఇద్దరూ తమ తమ సినిమాల్లో మళ్ళీ ఫుల్ బిజీగా అయ్యిపోవడం ఫ్యాన్స్ నడుమ సోషల్ మీడియాలో రచ్చ ఇలా చాలానే గడిచిపోయాయి.
అయితే మళ్ళీ ఫైనల్ గా ఆ అందరికీ ఈ ఇద్దరు యంగ్ హీరోస్ స్వీట్ షాకిచ్చారు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన క్లాసిక్ హిట్ చిత్రం “ఎవడే సుబ్రహ్మణ్యం” మళ్ళీ రీరిలీజ్ కి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మళ్ళీ విడుదల కోసం ఈ యువ హీరోలు ఒక్కటయ్యారు. ఆ సినిమాలో ఒక ఐకానిక్ సీన్ ని రీక్రియేట్ చేసిన పిక్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నాని హిట్ 3 (HIT 3) లుక్ లో విజయ్ కింగ్డమ్ (Kingdom) లుక్ లో బైక్ మీద కూర్చున్నట్టు కనిపిస్తున్నారు. ఇక వీరితో పాటుగా నంది.. అదే మాళవిక నైర్ కూడా కనిపిస్తుంది. దీనితో ఈ స్పెషల్ పిక్ వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రాన్ని కల్కి 2898 ఎడి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించగా ప్రియాంక దత్, స్వప్న దత్ లు నిర్మాణం వహించారు.