ఇళయ దళపతి విజయ్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “వారిసు” కోసం తెలిసిందే. ఈ చిత్రం విజయ్ కెరీర్ లోనే భారీ వసూళ్లతో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా నిలవడం విశేషం. అయితే ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ అయి మంచి సక్సెస్ ని అందుకోగా రీసెంట్ గానే ఈ సినిమా హిందీ మినహా అన్ని భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో లో అయితే అందుబాటులోకి వచ్చింది.
మరి లేటెస్ట్ గా అయితే ప్రైమ్ వీడియో వారు ఓ ఇంట్రెస్టింగ్ ఢిలీటెడ్ సీన్ ని రిలీజ్ చేశారు. ప్రకాష్ రాజ్ మరియు విజయ్ ల మధ్య ప్రకాష్ రాజ్ ఆఫీస్ లో నడిచే సాలిడ్ సీన్ ఇది. అయితే ఈ సీన్ ని ఇప్పుడు చూసిన ఫ్యాన్స్ మరియు ఆడియెన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పక్కా థియేటర్ మెటీరియల్ సీన్ ని ఎందుకు తీసేశారని దర్శకుణ్ణి అడుగుతున్నారు. ఇది కూడా థియేటర్ లో ఉండి ఉంటే రచ్చ ఇంకోలా ఉండేది అని అంటున్నారు. అలాగే ఈ సీన్ కి థమన్ ఇచ్చిన స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో విజయ్ ఫ్యాన్స్ మాత్రం క్రేజీ గా ఫీల్ అవుతున్నారు.
there you go!
an exclusive unseen footage from #VarisuOnPrime to pump up your adrenaline! pic.twitter.com/X6bnCRAUwP— prime video IN (@PrimeVideoIN) March 3, 2023