మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా మైసూర్ నగరంలో స్టార్ట్ అయింది. ప్రస్తుత షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. కాగా తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ కూడా నటించబోతుందని.. ఆ పాత్ర నెగిటివ్ రోల్ అని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాలి.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నారట. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా జాన్వీకపూర్ నటించబోతుంది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాకి నిర్మాణం వహిస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.